ఏపీ ప్రజలకు అలర్ట్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్ గా బలపడింది. దీంతో అధికారులు ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తరిస్తున్నాయని తెలిపారు.
దీంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షలు కురిస్తే అవకాశం ఉంది. రేపు ఉదయం బాపట్ల దివిసీమ మధ్య తుఫాన్ తీరం దాటనుంది. తుఫాన్ ప్రభావంతో దివిసీమకు ముప్పు పొంచి ఉంది. వర్షాల దృష్ట్యా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.