టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన జెండా ఎన్టీఆర్ భవన్ కు, తెలుగుదేశం జెండా గాంధీ భవన్ కు కట్టారని, సిగ్గు, శరం లేనోళ్లు.. అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించగా గాంధీ భవన్ లో పార్టీ సంబురాలు జరిగాయి. అయితే ఈ సంబురాల్లో టీడీపీ జెండాలు ఎగరడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.