డి హీరేహాళ్ మండలం హిర్దేహల్ గేట్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వేపులపర్తి కి చెందిన హెచ్. శివన్న మృతిచెందాడు. ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపిన మేరకు. ఆటో నడుపుతూ జీవనంసాగించేవాడు. బళ్లారిలో ప్రయాణికులను దించి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరాడు. హిర్దేహల్ సమీపాన స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో శివన్న తీవ్ర గాయాలపాలయ్యాడు. బళ్లారిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.