యాడికి మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు వైఎస్ఆర్సిపి యువ నాయకులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి చెన్నకేశవ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.