హిందూపురం సేబ్ స్టేషన్ పరిధిలో సోమవారం కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 140 కర్ణాటక మద్యం ప్యాకెట్లను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సెబ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ధర్మవరం మండల పరిధిలోని నేలకోట తండాలో 70 లీటర్ల బెల్లపు ఊటను, చెన్నే కొత్తపల్లి మండల పరిధిలో 45 లీటర్లను ధ్వంసం చేశారు.