హిందూపురం పట్టణంలో ఘంటసాల 102వ జయంతి ఘనంగా నిర్వహించారు. సోమవారం పట్టణంలోని ఇందిరా పార్కులో ఉన్న గంటసాల విగ్రహానికి మండల విద్యాధికారి గంగప్ప, జేబీవీ అధ్యక్షులు రామకృష్ణ, ఘంటసాల అభిమానులు సిద్దయ్య, ఆంజనేయులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాల తెలుగు రాష్ట్రాలలో పుట్టడం భాగ్యమని అన్నారు. భగవద్గీత ఆలపించి ప్రపంచంలోనే తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేశారన్నారు.