ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 2024 జనవరి 1 నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు.
2023-24లో భాగంగా నవంబర్ నెలాఖరు నాటికి 12.42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని వెల్లడించారు. క్యాంపుల్లో స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలిపారు. 110 మున్సిపాలిటీల్లోని పట్టణ, నగర ప్రాంతాలను కవర్ చేస్తూ వారంలో 162 క్యాంపులు ఉంటాయన్నారు.