మిచాంగ్ తుఫాను తీవ్రతరం కానుంది. నెల్లూరుకు 80 కి. మీ, బాపట్లకు 80 కి. మీ, మచిలీపట్నానికి 140కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం మధ్యాహ్ననంలోపు బాపట్ల దగ్గరలో తీవ్రతుఫానుగా తీరం దాటనుంది.
తీరం వెంబడి గంటకు 90-110 కి. మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.