స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 8,283 జూనియర్ అసోసియేట్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7 చివరి తేదీ.
డిగ్రీ పూర్తి చేసిన 20 నుంచి 28 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2024 జనవరిలో ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. TSలో 525, ఏపీలో 50 పోస్టులున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.750. SC, STలకు ఫీజు లేదు. పూర్తి వివరాలు sbi.co.in వెబ్ సైట్ లో చూడండి.