వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. కూటమి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు డిసెంబర్ 6న సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
అయితే అనూహ్యంగా ఆ మీటింగ్ వాయిదా పడింది. ఈ సమావేశానికి కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు హాజరు కావడం లేదు. దాంతో మీటింగ్ వాయిదా పడటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.