బీజేపీ ఎంపీ కిరోడీ లాల్ మీనా చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించినట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ బుధవారం తెలిపారు. "రాజస్థాన్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కిరోడి లాల్ మీనా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తూ నాకు డిసెంబరు 6వ తేదీన వ్యక్తిగతంగా సమర్పించిన లేఖ నాకు అందింది. తక్షణమే ఆయన రాజీనామాను ఆమోదించాను" అని ధంఖర్ ఎగువ సభలో తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ నుంచి మీనా విజయం సాధించారు.