రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి నేషపోగు కిరణ్మయి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లం ఘించి, కోర్టు ఆదేశాలను ధిక్కరించి రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేశారన్నారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వైసీపీని ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ లోటు బడ్జెట్ ఉన్నా అభివృద్ధి చేసి చూపించిం దని, ఆ ఘనత తమ అధినేత నారా చంద్రబాబుకే దక్కిందన్నారు. అమ రావతి అనే రాజధాని సృష్టించి ప్రజలకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. వైసీపీ అరాచక పాలనకు విసుగెత్తిన ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరు కుంటున్నారని తెలిపారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన మార్పు 2024 ఎన్నికల్లో ఏపీలో కూడా రాబోతోందన్నారు. కోడు మూరు నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని, టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్మంగా ముందుకు సాగుతా మని కిరణ్మయి తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు పట్టణ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు జయకృష్ణ, టీడీపీ అభిమానులు చిల్లబండ బాషా, తులసి, పూర్ణచంద్రరావు, లేపాక్షి, గౌరి, రాముడు, రాజేష్, తేజ పాల్గొన్నారు.