ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 04:31 PM

విజయనగరం జిల్లా, శృంగవరపుకోటమండలంలో 2018లో గంజాయి కేసులో ప ట్టుబడిన ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు న్యాయాధికారి తీర్పు చెప్పినట్టు ఎస్‌ఈబీ సీఐ ధర్మారావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు 2018లో దురియ సాయిబాబా, దురియ కమ ల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వారిపై జిల్లా న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ మేరకు వారికి శిక్ష విధిస్తూ జిల్లా న్యాయాధికారి రజని తీర్పు ఇచ్చారని ధర్మారావు తెలిపారు. ఈ కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.రవికుమార్‌ వాదించారని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com