రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని టీడీపీ పాణ్యం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకుని టీడీపీ మ్యానిఫేస్టోను ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ..... జగన్ ప్రభుత్వంలో ప్రజలు, మహిళలకు రక్షణ కరువైందన్నారు. బస్సు, కరెంట్ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, మధ్యం రేట్లు పెంచి రాష్ట్ర ఖజానా నింపుకుంటు న్నారన్నారు. జాబ్‌క్యాలెండర్, ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిం చడంలో విఫలమయ్యారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అన్నివర్గాల అభివృద్ధి జరిగిందని, కల్లూరు అర్బన్ వార్డుల్లో కొత్తగా జరిగింది ఏమీలేదని అన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్రారెడ్డి, పల్లె రఘునాఽథ్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, సుధాకర్, లక్ష్మణ్, సుదర్శన్‌రెడ్డి, ముధునా యక్, శివారెడ్డి, భరత్‌నాయక్, వినోద్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.