బాపట్ల జిల్లా, మండలం, భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి సమయంలో వెళ్లి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైసీపీ అహంకారానికి నిదర్శనమని, బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా బాపట్ల మండలం, భక్తిపూడి గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీకి చెందిన వ్యక్తులు అర్ధరాత్రి ధ్వంసం చేశారు. విగ్రహం తల పగలగొట్టారు. ఈ ఘటనపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.