రాజాం-డోలపేట మధ్య బుధవారం వాహనాల రాకపోకలు స్తంభించాయి. మంగళవారం రా త్రి ఏకధాటిగా కురిసిన వర్షానికి కిలో మీటర్ మేర రహదారి నదిని తలపించింది. విస్తరణ పనులు ప్రారంభించి 11 నెలలు గడుస్తున్నా కొలిక్కి రాని నేపథ్యంలో రహదారి పూర్తిగా గోతులమ యంగా మారింది. వర్షపు నీటి తో రహదారిలో ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియని సందిగ్ధత వాహన చోదకుల్లో నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ రహదారి పైనే నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో దాదాపుగా ద్విచక్ర వాహనాల రాకపో కలు నిలిచిపోయాయి. మరికొంత మంది ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించారు. రాజాం-శ్రీకాకుళం రోడ్డులో సప్తగిరి కాలనీ వద్ద రహదారి కొట్టుకు పోయి గండి ఏర్పడింది. వాహన చోదకులు తీవ్ర అవస్థలకు గురయ్యారు.