బాపట్ల జిల్లా, మండలం భర్తీపుడిలో వైసీపీ అల్లరి మూకలు ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాళ్ళు ధ్వంసం చేసింది విగ్రహాన్ని కాదని తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకను అని అన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారని మండిపడ్డారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించారని, విగ్రహాలపై దాడులు చేస్తున్నారని అన్నారు. అధికారమదంతో పేర్లు మార్చగలరు, విగ్రహాలు పగులగొట్టగలరేమో కానీ ప్రజల గుండెల్లో నుంచి ఎన్టీఆర్‌ను తొలగించలేరని స్పష్టం చేశారు. అధికారమదంతో అన్నగారి విగ్రహాలు పగులగొడుతున్న వారి ఒళ్లు పగలకొట్టడం ఖాయమని హెచ్చరించారు. దుండగులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.