వర్షాలకు దెబ్బతిన్న వరి, మిర్చి, పత్తి పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె తూర్పు గోదావరి జిల్లా, నెల్లిపాకలో తుఫాన్‌తో దెబ్బతిన్న వరి, మిర్చి పంటలను పరిశీలించారు. రైతులను ఇప్పటి వరకు పంటకు పెట్టిన పెట్టుబడులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే దెబ్బతిన్న పత్తికి పరిహారం ఇవ్వాలన్నారు. తుఫాన్ తీవ్రత తగ్గాక సమగ్ర పంట సర్వే నిర్వహించి, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సీపీఎం బృందం కూడా పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. ఆ పార్టీ మండల కార్యదర్శి ఐ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దెబ్బతిన్న వరి, పత్తి, మిర్చి పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పుట్టి రమేష్‌బాబు, టీడీపీ నాయకులు రాజేష్, కానూరి బుల్లెబ్బాయి, సీపీఎం నాయకులు గద్దల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |