శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి విద్యుత్ నగర్‌కు చెందిన అసూరు మానిక(63) పలాస రైల్వేస్టేషన్‌లో యాసిడ్ తాగి అపస్మారక స్థితికి చేరుకోగా జీఆర్పీ పోలీసులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్ళితే..... ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈమె కొంత కాలంగా విద్యుత్ నగర్‌లోని కుమార్తె రొక్కం కుమారి వద్ద ఉంటోంది. అయితే మంగళవారం ఏమైందో గాని ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లి ఆచూకీ కోసం వెదికినా కానరా లేదు. పలాస రైల్వే స్టేషన్‌లో యాసిడ్ తాగి అపస్మారక స్థితిలో చేరుకోగా జీఆర్పీ పోలీసులు పలాస ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పోస్టు మార్టం గురువారం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నట్లు సమాచారం.