బాపట్ల జిల్లా, మండలం భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో వైసీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని ఆయన విగ్రహాల కూల్చివేతతో వైసీపీ చెరిపేయలేదన్నారు. 3 నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామన్నారు. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్ అని లోకేష్ అన్నారు.