ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మిచౌంగ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ సమయంలో వరద బాధితులను పరామర్శించనున్నారు. పంట నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా సీఎం వైయస్ జగన్ పరిశీలించనున్నారు. తుపాన్ సమయంలో ప్రభుత్వం అందించిన సాయంపై సీఎం వైయస్ జగన్ స్వయంగా బాధితులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.