2021తో పోలిస్తే 2022లో గుండెపోటు మరణాలు 12.5 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2022లో 32,547 మంది గుండెపోటు కారణంగా మరణించారని తెలిపింది.
కోవిడ్ వల్ల గుండె పనితీరు బలహీనంగా మారిందని, అదే ఈ మరణాలకు ఒక కారణమని ఎస్‌సీఆర్‌బీ వెల్లడించింది. అలాగే 2022లో 56,450 మంది హఠాత్తుగా మరణించారని, మూడేళ్లలో పోలిస్తే ఈ సంఖ్య కూడా భారీగా పెరిగిందన్నారు.