సహజీవనంపై హర్యానా బీజేపీ ఎంపీ ధరమ్‌బీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన సహజీవనాన్ని ప్రమాదకర రోగంగా అభివర్ణించారు. ప్రేమ పెళ్లిళ్లలో విడాకుల రేటు పెరుగుతోందని ధరమ్‌బీర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి విడాకులకు వధూవరులిద్దరి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సహజీవాన్ని సమాజం నుంచి నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆయన కోరారు.