జొమాటో డెలివరీ బాయ్ పేరుపై రూ.75 కోట్ల నల్లధనం ఉన్నట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని జొమాటో డెలివరీ బాయ్ మోను కుమార్ పేరుతో ఆదాయపు పన్ను, జీఎస్టీ ఎగవేేత కోసం రూ.75 కోట్ల బోగస్ సేల్ కొనుగోళ్లను చూపించారు. ధన్‌బాద్‌లోని సరైధేలాలో జరిగిన ఐటీ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. పాన్ నంబర్‌తో డెలివరీ బాయ్ భోగస్ కొనుగోళ్లు, కోట్లు విలువ చేసే అమ్మకాలు చూపించాడు.