గేదె పేడ ముఖానికి పూయడంతో ఊపిరాడక ఆరు నెలల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయుష్ను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముఖంపై పేడ ఉండటంతో ఊపిరాడక మృతి చెందినట్లు జిల్లా ఆసుపత్రి మెడికల్ ఇంచార్జి డాక్టర్ పంకజ్ రాజ్పుత్ తెలిపారు.