చలికాలంలో వెల్లుల్లిని ఆహారంలో బాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. అలాగే అల్లిసిన్ అనే సమ్మేళనం ఉండటంతో అది ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని కాపాడుతుంది. వెల్లుల్లిలో వేడి పుట్టించే గుణాలు శరీర ఉష్ణోగ్రతని పెంచి చలిని తగ్గిస్తాయి. అలాగే వెల్లుల్లి రక్తపోటుని నియంత్రిస్తుంది.