వైసీపీ పాలనలో ప్రతి పథకం అవినీతిమయంగా మారిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి, రూ.3,359 కోట్ల నిధులను ప్రభుత్వం తన ఇష్టానికి వాడేసుకుందని ఆరోపించారు.
గ్రామాల్లో ఖర్చు పెట్టాల్సిన నిధులను సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లకు తెలియకుండానే దారి మళ్లిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.