ఒడిస్సాలో ఆదాయపు పన్ను శాఖ దాడులలో కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు ధీరజ్ ప్రకాష్ సాహుకి చెందిన సుమారు రూ. 500కోట్లు పట్టుబడటంపై శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ నాయకులు శనివారం నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేసారు. దోచుకోవడం, దాచుకోవడం, స్కాములు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.