ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చర్చలు జరుగుతుంటే.. సరిహద్దుల్లోకి చైనా చొరబడి గ్రామాలు, ఔట్‌పోస్ట్‌లు నిర్మాణం

international |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2023, 11:07 PM

పొరుగు దేశాల భూభాగాలను కబ్జా చేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. విస్తరణవాద కాంక్షతో రగిలిపోయే డ్రాగన్.. పక్క దేశాల ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటే జెండా పాతేయడం అలవాటు చేసుకుంది. భూటాన్‌తో సరిహద్దు వివాదంపై ఓ పక్క చర్చలు జరుగుతుంటే.. తాజాగా, ఉత్తర భూటాన్‌లోని జకర్లుంగ్ వ్యాలీలో అనుమతి లేని నిర్మాణ కార్యకలాపాలను చైనా చేపట్టిన్నట్టు ఉపగ్రహ ఫోటోలు బయటపెట్టాయి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూటాన్ తూర్పు సరిహద్దు ఈ ప్రాంతంలో చైనా చర్యలను అంగీకరించడం తప్ప థింఫుకు వేరే మార్గం లేదని శాటిలైట్ ఫోటోలు సూచిస్తున్నాయి.


‘ఇంతకుముందు పశువుల కాపర్ల చర్యల ఆధారంగా ఒక ప్రాంతాన్ని తమదిగా చైనా వాదించేది.. కానీ, ఇవి మునుపెన్నడూ లేని చర్యలు.. ఏకపక్షంగా భూభాగాన్ని స్వాధీనం చేసుకుని, గ్రామాలు, సైనిక బ్యారక్‌లు, అవుట్‌పోస్టులతో స్థిర ఆవాసాలను ఏర్పాటుచేసుకుని ఆక్రమణకు పాల్పడుతోంది’ అని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)టిబెటన్ చరిత్ర నిపుణుడైన ప్రొఫెసర్ రాబర్ట్ బార్నెట్‌కి అన్నారు. ‘జకర్లుంగ్ బేయుల్ ఖెంపాజోంగ్‌కు ఆనుకొని ఉంది.. ఇది భూటానీలకు ముఖ్యమైన సాంస్కృతిక, మతపరమైన ప్రాంతం. సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతం తమదేనంటూ చైనా ఇటీవల వివాదాస్పద వాదన తెరపైకి తెచ్చింది.. దీనిపై ప్రతిస్పందనకు సంబంధించి కొన్ని ఎంపికలు ఉన్నాయని తెలుసు’ అని ఆయన పేర్కొన్నారు.


మాక్సర్ టెక్నాలజీ నివేదికలోని శాటిలైట్ ఫోటోలు జకర్లుంగ్ లోయలో చైనా భౌతిక ఉనికిని రెండేళ్లుగా ఎలా పెంచుకుందో చూపిస్తుంది. గత వారం డిసెంబర్ 7 నాటి చిత్రాలు.. నివాస గృహాలుగా కనిపించే కనీసం 129 భవనాలు, కొద్ది దూరంలో ఉన్న రెండవ ఎన్‌క్లేవ్‌లో నిర్మాణంలో ఉన్న కనీసం 62 భవనాలను చూపుతున్నాయి. ఆగస్టు 2021కు ముందు అక్కడ ఎటువంటి భవనాలు లేవని గత ఫోటోలు వెల్లడించడం గమనార్హం. ‘ఈ గ్రామాలు కేవలం ఔట్‌పోస్ట్‌లు కావు.. చైనా ప్రాదేశిక ఆశయాలకు మద్దతు ఇచ్చే సమగ్ర పర్యావరణ వ్యవస్థను ఏర్పరుచుకునే సమగ్ర భాగాలు.. భూటాన్ ప్రకృతి స్థలాకృతి మరింత దోహదం చేస్తుందని ఈ అభివృద్ధి కార్యకలాపాల పూర్తి స్థాయి నొక్కి చెబుతుంది’ అని డామియన్ సైమన్ చెప్పారు. తన భూభాగంలోకి చైనా చొరబాట్లను భూటాన్ ముగించే ప్రయత్నంలో వారితో సంబంధాలను పెంచుకున్న సమయంలో కొత్త ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో విదేశాంగ మంత్రి తండి దోర్జీ భూటాన్‌కు తొలిసారిగా బీజింగ్‌కు వెళ్లారు. అదే నెలలో ప్రధాన మంత్రి లోటే షెరింగ్ మాట్లాడుతూ.. 'ఇటువైపు భూటాన్, ఆ వైపు చైనాను చూడాలని మేము ఆశిస్తున్నాం.. ప్రస్తుతం అది దగ్గరగా లేదు’ అని వ్యాఖ్యానించారు.


విశేషమేమిటంటే షెరింగ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బీజింగ్, థింఫు భూ మార్పిడికి అంగీకరించే అవకాశాన్ని తిరస్కరించలేదు. డోక్లామ్ పీఠభూమి మరింత దక్షిణాన ఉంది. నవంబరులో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ఉమ్మడి ప్రకటనలో కొనసాగుతున్న సరిహద్దు చర్చల వివరాలు పేర్కొనలేదు. అయినప్పటికీ ఇరు పక్షాలు 'ద్వైపాక్షిక సహకారం, పరస్పర ప్రయోజనాల ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు జరిపాయి. ఇక, 2017లో భారత్, చైనా దళాల మధ్య రెండున్నర నెలల పాటు డోక్లామ్ వద్ద ప్రతిష్టంభన కొనసాగింది. డోక్లాం త్రికూడలిలో అక్రమంగా చైనా చేపట్టిన రహదారుల నిర్మాణాన్ని భారత సైన్యం అడ్డుకుంది. ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com