వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. నేడు అనకాపల్లి జిల్లా, చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. రోలుగుంట నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తకోట ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 3 గంటలకు వడ్డాదిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. బస్సు యాత్రలో డిప్యూటీ సీఎంలు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, గుడివాడ అమర్నాథ్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొంటారు.