వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ...భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76ఏళ్లు అవుతోంది. కానీ సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగానే ఉండిపోయింది. కానీ మన రాష్ట్రంలో, జగనన్న పాలనలో సామాజిక సాధికారత ఒక విధానంగా మారింది. సామాజిక న్యాయంతో..సామాజిక సాధికారత సాధించి చూపారు సీఎం జగనన్న. తక్కువ కులాలుగా చూసి అవమానించిన దుర్మార్గుడు చంద్రబాబు అయితే.. వారిని అక్కున చేర్చుకుని..వారి జీవితాలు ఉన్నతంగా ఉండాలని అనుక్షణం తపించిపోతున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచడమే కాకుండా. రాజకీయంగా ఉన్నత పదవులచ్చి..సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. వెనుకబాటు వర్గాలకు చెయ్యిపట్టుకుని మరీ ముందుకు నడిపిస్తున్న నాయకుడు జగనన్న.ప్రతి కుటుంబం, ముఖ్యంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, పేద కుటుంబాలకు చెందిన వారు జగనన్న హయాంలో తమకు జరిగిన మేలు గురించి ఆలోచించాలి. బాబు హయాంలో తమ జీవితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు జగనన్న పాలనలో తమ జీవితాలు ఎలా ఉన్నాయి? అన్నది ఆలోచించాలి అందరూ. అప్పుడు జగనన్న ఎంత గొప్ప నాయకుడో, మనస్సున్న మనిషో అర్థమవుతుంది అని అన్నారు.