వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.... జగనన్న మీద అభిమానంతో ఈ సామాజికసాధికార బహిరంగ సభకు వచ్చిన మీరంతా జగనన్న మంచి మనసును అర్థం చేసుకున్నవారని అర్థమవుతోంది. భారతదేశంలోనే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే..ఇక్కడ సమర్ధంగా జరుగుతున్న పాలనవల్లనే.నా ఎస్సీ, నాఎస్టీ, నాబీసీ, నామైనార్టీలంటూ ఇన్నాళ్లు రాజకీయంగా,సామాజికంగా వెనుకబడిన వర్గాలన్నింటినీ..అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలోనే జగనన్న ఒక్కరే.విద్యావ్యవస్థను పూర్తిగా మార్చేసి, పేదపిల్లలకు, బడుగు బలహీనవర్గాల పిల్లలకు, కార్పొరేట్ స్థాయి విద్య అందేలా చేశారు జగనన్న. ఇంగ్లీషు చదువులతో పేదల పిల్లలు, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్న...పేదల పెన్నిధి.ఈరోజు 3వేల పైచిలుకు వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో తెచ్చిన మేటి జగనన్న. ఆయన వల్లనే ఈరోజు ఎంత పేదవారైన కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలుగుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. ఈరోజు ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. పారదర్శకంగా పథకాలు అందుతున్నాయి. ఈరోజు దేశం మొత్తం జగనన్న పథకాలను అనుసరించాలని చూస్తోంది.చంద్రబాబు హయాంలో ఓ వర్గం మినహా బాగుపడ్డవారంటూ ఎవరూ లేరు. ఇక ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకైతే చంద్రబాబు అవమానించిన, చులకనగా చూసిన సందర్భాలెన్నో ఉన్నాయి. గతంలో ఆయన ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. మోసకారి బాబు మనకొద్దు.జగనన్ననే మళ్లీ గెలిపించుకుందాం. జగనన్న మన అవసరం అని తెలియజేసారు.