అబివృద్ధి, సంక్షేమం కోసం మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. మళ్లీ జగన్ రావాలి.. సీఎం జగనే కావాలి అంటూ సభలో ఆయన నినదించారు. సమరానికి సైనికులై ...అన్నలారా... అమ్మాలారా.. ముందుకు రండి. వైఎస్సార్ జెండాను ఎగురవేయండి... అంటూ రాజన్నదొర ఉత్సాహపరిచారు.