40 ఏళ్లకు పైబడి రాజకీయానుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానపరచగా, జగన్ అధికారం చేపట్టిన తర్వాత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక సాధికారతను సాధించి చూపారని ఎంపీ నందిగo సురేశ్ కొనియాడారు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందంటే కారణం జగన్ తాను చేసిన పాదయాత్రలో ప్రజా సమస్యల పట్ల ఆవేదనతో తీసుకున్న చర్యలేనని గుర్తు చేసారు. చంద్రబాబుకు తాత్కాలికంగా బెయిల్ వచ్చింది కానీ, చేసిన తప్పులకు ఏదోనాడు శిక్ష లు తప్పవని న్యాయస్థానాలు పేర్కొంటున్నాయని వివరించారు. బాబు, లోకేశ్ సైకోలు కాబట్టే వారిని ఎన్నికల్లో ఓడించారని, పవన్ తన రాజకీయ పార్టీని పెట్టి చంద్రబాబుకు అద్దెకి ఇస్తున్నాడని మండిపడ్డారు. జగన్ సింగిల్ గా వస్తూ సవాల్ చేస్తున్నా సరే పొత్తులు లేకుండా రావడానికి బాబు, పవన్ లకు దమ్ము లేదని ఎద్దేవా చేసారు. బషీర్ బాగ్ లో రైతులు విద్యుత్ చార్జీలపై ఆందోళన చేస్తే కాల్పులు చేయించిన చంద్రబాబు, ఇప్పుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతు సంక్షేమం అంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం వెన్నుపోటు పథకమేనని, ఎన్టీఆర్ చావుకు కారణమై,పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్ లు కూడా దక్కలేదని, బర్రెలక్కకు ఆరు వేలు ఓట్లు వచ్చాయన్నారు. పోటీ చేయని చంద్రబాబు, పోటీ చేసినా డిపాజిట్ రాని పవన్ కలసి బర్రెలక్క ను చూసి బుద్ది తెచ్చుకో వాలని హితవు పలికారు. మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎలా అవసరమో, రాష్ట్ర అబివృద్ధికి జగన్ కూడా రాష్ట్రానికి అలానే అవసరమని నందిగంసురేశ్ వ్యాఖ్యానించారు.