ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో, నాలుగున్నరేళ్ల కాలంలో సీఎం జగన్ పాలనలో ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవాలని రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. బాబు హయాంలో వ్యవసాయ రంగం మైనస్ గ్రోత్ లో పడిపోగా, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 5.56 శాతంతో వ్యవసాయ రంగం పురోగమించిందని కేంద్ర ప్రభుత్వం వివరించ్చిందన్నారు. బాబు హయాంలో వ్యవసాయ రంగం 16వ స్థానంలో ఉంటే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం 4వ ర్యాంక్ ను జాతీయ స్థాయిలో కైవశం చేసుకుందని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, గిట్టు బాటు ధర కల్పన, విత్తనాలు అందుబాటులో ఉంచడం, రైతు భరోసా జమ వంటి చర్యలతో వ్యవసాయ రంగాన్ని జగన్ పురోగతిలోకి తీసుకువచ్చారన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా తన పాలనలో నిర్వీర్యం చేసిన చంద్రబాబు ఇటీవల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతున్నారని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేని పాలనా వ్యవస్థను తీసుకువచ్చినది జగన్ కాకుంటే మరోకరికీ సాధ్యం కాలేదన్నారు. జగన్ పాలనలో పేదలంతా ఆత్మగౌరవంతో సంక్షేమ పథకాల లబ్ధిని పొందుతున్నారని గుర్తు చేసారు. ఎన్నికలు వస్తే చాలు పసుపు కుంకుమ లాంటివి చంద్రబాబుకు గుర్తుకు వస్తుంటాయని, కానీ జగన్ మాత్రం పాలనా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మహిళా సాధికారతకు చర్యలు చేపట్టారన్నారు. కోట్లాది కుటుంబాల జీవితాలను తీర్చిదిద్దుతూ, సంక్షేమం అందిస్తూ జీవన ప్రమాణాలు పెరిగేలా జగన్ పాలన సాగిస్తుంటే, చంద్రబాబు కుమారుడు లోకేశ్ సైకో పాలన అంటున్నాడని, సైకోలు ఇంతటి జనరంజక పాలన చేస్తారా అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి, చంద్రబాబు సీఎంగా 14ఏళ్లలో కూడా చేయలేకపోయారని విమర్శించారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో చోడవరంలో వార్ వన్ సైడ్ అని సామాజిక సాధికార బస్సు యాత్రకు హాజరైన జనసందోహాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. నాడు - నేడు ద్వారా విద్యార్థులకు, జగనన్న సురక్ష ద్వారా ఆరోగ్యం, మెడికల్ కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్య వంటి రంగాల్లో సరికొత్త నిర్ణయాలు తీసుకుని జగన్ మార్పు తీసుకువచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ పిలుపు మేరకు 175 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరోసారి జగన్ ఎన్నిక కాావాల్సిన ఆవసరాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, ఆదర్శవంతమైన శక్తిగా ఆవిర్బవించి, రాష్ట్రాన్ని జనరంజకంగా సీెఎం జగన్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ను మించిన నాయకుడు దేశంలోనే లేడని, సచివాలయాలు, వాలంటీరు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన మొనగాడు జగన్ అని పేర్కొన్నారు. చెరకు రైతులకు చంద్రబాబు సున్నం రాస్తే , జగన్ రూ. 80 కోట్లను కేటాయించి రైతాంగ సమస్యను పరిష్కరించారని గుర్తు చేసారు. రూ. 32 కోట్లతో నియోజకవర్గంలో పలు కీలక ప్రాంతాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణం చేసారని వివరించారు. ఎప్పటి నుంచో పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో ఉన్న వడ్డాది నుంచి గన్నవరం వరకు రోడ్డును నిర్మాణం చేస్తున్నామని, సకాలంలో వేయకపోతే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. నాడు - నేడు ద్వారా 89 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో అబివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రూ. 1900 కోట్ల చోడవరం నియోజకవర్గానికి మంజూరు చేసి నాలుగున్నరేళ్లలో వైయస్ జగన్ విప్లవాత్మక అభివృద్ధిని తీసుకువచ్చారన్నారు.