ఓటర్ల మార్పులు, చేర్పుల ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికార పార్టీ అక్రమాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజీంద్రన్‌ను కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపేలా దొంగ ఓటర్లను చేరుస్తూ తెలుగుదేశం, జనసేన సానుభూతిపరుల ఓట్లను తొలగించేలా ఆన్‌లైన్‌లో ఫాం–6, ఫాం–7లను పొందుపరిచిందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్కో బూత్ ఏజెంట్ పదుల సంఖ్యలో ఓట్ల తొలగింపునకు ఆన్‌లైన్‌లో పొందుపరిచారని అలాగే దొంగ ఓట్లు నమోదుకు యత్నించినట్టు తెలిసిందన్నారు. ఈ చర్యలకు పాల్పడుతున్న బూత్ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ ఒక్కో బూత్ ఏజెంట్ నిబంధనల ప్రకారం ఐదుగురికి మించి దరఖాస్తులు పెట్టకూడదని, అలా పెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఈవీఎంల పనితీరు మోడల్‌ను సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ప్రదర్శించగా ముద్దరబో యిన పరిశీలించారు. టీడీపీ నూజివీడు పట్టణ అధ్యక్షుడు మల్లిశెట్టి జగ దీష్, నాయకులు నూతక్కి వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి పల్లి నాగరా జు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తలపంటి రాజశేఖర్, ఏలూరు పార్లమెంట్ అంగన్‌వాడీ, డ్వాక్రా మహిళా అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొమ్మన విజయ, సయ్యద్ నజీమున్నీసా, జనసేన నాయకుడు ముత్యాలకామేష్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గద్దె రఘు, గోగినేని మధు, పాదం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.