మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను జనవరి 8 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న కేసులో తన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 6న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. డిసెంబరు 9న జైన్‌కు పాదం పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించిన జస్టిస్‌లు బేలా ఎం త్రివేది, ఎస్‌సి శర్మలతో కూడిన ధర్మాసనం ఆయనకు ఉపశమనం కల్పించింది.జైన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరారు.బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన జైన్ ప్రస్తుతం ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.