కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.
ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు ఈ నెల 17 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంది. రద్దీ ఎక్కువ కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa