టీడీపీ తోనే గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు అభివృద్ధి చెందుతాయని కడప జిల్లా, మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మల పాటి రమేష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గం లోని మాజీ సర్పంచలు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు అవుతున్నా, చాలా పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా వైసీపీ పాల నలో పంచాయతీలకు కేంద్రం ఇచ్చే 15వ టీఎఫ్‌సీ నిధులను జగన ప్రభుత్వ ఖజానాలకు మళ్లించడంతో చాలా మంది వైసీపీ మద్దతుదారులైన సర్పంచలు వారి పంచాయతీల్లో నిధులు లేక, అత్యవసర సమస్యలు పరిష్కరించేందుకు సొంత నిధులు వెచ్చించి అప్పుల పాలయ్యారన్నారు. చంద్రబాబు సీఎం అవుతూనే గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయిస్తారని, వైసీపీ సర్పంచలు అందరు టీడీపీలో చేరాలని పిలుపునిచ్చారు. పంచాయ తీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.10615 కోట్ల పంచాయతీ నిధులను జగన దారి మళ్లించారని సర్పంచల అనుమతి లేకుండా నిధులు మంజూరు చేయడం దొంగతనం కాదా అని ప్రశ్నించారు. ఈ సమావే శంలో టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు భవానిప్రసాద్, దేవరింటి శ్రీనివాసులు, విజయ కుమార్‌గౌడ్, వెంకటరమణ, మాజీ సర్పంచలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.