టమోటా ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సుమారు 250 ఎకరాలలో టమోటా సాగు చేశారు. మార్కెట్‌లో 16 కేజీల బాక్స్ కేవలం రూ.30 నుంచి రూ.150 మాత్రమే ధర పలుకుతోంది. ఈ లెక్కన కిలో ధర రూ.2 నుంచి రూ.9 వరకు మాత్రమే ఉంటోంది. ఈ ధరకు పెట్టుబడి కూడా దక్కదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటా సాగుకు ఎకరానికి రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. వారం క్రితం 16 కేజీల బాక్స్ రూ.120 నుంచి రూ.250 వరకూ ధర పలికింది. ప్రస్తుతం ఆ ధరలు అమాంతం పడిపోయాయి.