రామోజీరావు, రాధాకృష్ణ పరాయి రాష్ట్రంలో ఉండి ఆంధ్రరాష్ట్రంలో ఎత్తుగడలు వేస్తూ విషం చిమ్ముతున్నారని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజాసంక్షేమానికి సీఎం జగన్ నేడు 2.5 లక్షల కోట్లు ఖర్చుపెడితే.. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ సొమ్మును ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక పోర్టు, మెడికల్ కాలేజీ, హార్బర్.. ఏమీ నిర్మించలేదని, అప్పులు మాత్రం దండిగా వదిలివెళ్లారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చి జనం సొమ్ము మూటలు కట్టుకోవాలనే చూస్తున్నారన్నారు.