విజయవాడ, కొత్తపేటలోని మరు పిళ్ల చిట్టి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించి దేవదాయశాఖకు అప్పగిం చాలని గుంటూరు జిల్లా పెదకాకానిలోని అమరావతి ఎండోమెంట్ ట్రైబ్యునల్ జడ్జి డాక్టర్ కె.మన్మథరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ కార్యా లయ యాజమాన్య హక్కులపై దాఖలైన పిటిషన్లను విచారించి వాద, ప్రతివాదనలను విన్న అనంతరం తీర్పు ఇచ్చారు. 16,650 చదరపు గజాల్లో కార్యాలయం ఉన్న స్థలంపై తమకే యాజమాన్య హక్కులు ఉన్నా యని కాంగ్రెస్ నాయకులు వాదించినా, కోర్టుకు తగిన సాక్ష్యాలు చూపించలేదని ట్రైబ్యునల్ భావించింది. 2020లో ఆనాటి కార్యాలయ ప్రెసిడెంట్ ఫణుకు శేషు తన పేరును వణుకు శేషుగా రికార్డులో పేర్కొనడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. వణుకు శేషు అధ్యక్షుడుగా లేడంటూ ఆయన వేసిన పిటిషన్ చెల్ల దంటూ పేర్కొంది. 1899 నుంచి స్థలం తమ కిందే ఉందని కార్యాలయ ప్రతినిధులు వేసిన పిటిషన్‌పై ఒరిజనళ్లు ఏవీ చూపించలేదని కోర్టు పేర్కొంది. ఈ స్థలం పుచ్చావారికి చెందిందని ఆ కుటుంబం స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారని, వారికి ఆస్తిపాస్తులు ఉండడంతో నోటిమాటగా స్థలాన్ని కాంగ్రెస్ కార్యాలయానికి ఇచ్చారని కోర్టుకు తెలిపినా, ఆధారాలు లేక పోవడంతో కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 2009లో మునిసిపల్ కార్పొరేషన్‌కు అర్జీ పెట్టుకుని ప్లాన్ సంపాదించినప్పటికీ అదీ ఒరిజనల్ కాదని కోర్టు నమ్మింది. ఆ స్థలం తమకు సంబంధించిందేనని, తమ పూర్వీకులు దేవదాయశాఖకు ఇచ్చారని పుచ్చా సీతారామారావు కోర్టుకు తగిన సాక్ష్యాధారాలు చూపించడంతో కార్యాలయాన్ని అందులో ఉన్న నిర్మాణాలను తొలగించి స్థలాన్ని యాజ మాన్యానికి అప్పగించాలని ఆదేశించింది.