రాష్ట్రంలో ప్రభుత్వం కులాలను విభజించి పాలన సాగిస్తోందని బీసీ హక్కుల పోరాటసమితి రాష్ట్రఅధ్యక్షుడు బోడెం రాజశేఖర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో 56 కులాలను సీఎం జగ న విభజించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి అధ్యక్షులను అలంకారప్రాయం చేసి ప్రజాధనా న్ని వారికి జీతభత్యాలు, ఖర్చులకు వృథా చేస్తున్నారని ఆరోపించారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావుపూలే విగ్రహాన్ని మదనపల్లెలో ప్రభుత్వ లాంచనాలతో ఏర్పాటే చేయాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నో పర్యాయాలు విన్నవించిన స్పందన కరువైందని వాపోయారు. ఇప్పటికైనా పూలే విగ్రహం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీహెచపీఎస్ నాయకులు గురుమూర్తి, మల్లయ్య, అంజి, నారాయణ, నాగభూణం, రమణ, తదితరుల పాల్గొన్నారు.