టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా.. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో విచారణకు అనుమతించాలంటూ సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లపై విచారణ జనవరి 30వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఆయన జైల్లో లేనందున ఈ పీటీ వారెంట్లు నిరర్థకమవుతాయంటూ ఏసీబీ కోర్టు పక్కన పెట్టింది. అయితే ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున.. వాటి విచారణ కొనసాగించాలని సీఐడీ పిటిషన్ వేసింది.