కేరళలోని శబరిమలకు రోజు రోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో అక్కడ రద్దీ ఏర్పడి కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే తిరుగుప్రయాణం అవుతున్నారు. ఈ రద్దీ దృష్ట్యా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అక్కడికి వచ్చే పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని ఒక ప్రత్యేక గేటు ద్వారా పంపించి ప్రత్యేక దర్శనం చేసుకునేలా నిర్ణయించింది. బోర్డు నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ఉదయం నుంచి ముందు వరుసలో ఉన్న చిన్నారులకు అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నాం. దీంతో క్యూలైన్ల కష్టాల నుంచి తప్పించుకున్నారు. ఈ చర్య పిల్లల తల్లిదండ్రులకు, ముఖ్యంగా కేరళ వెలుపల నుండి వచ్చే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది" అని TBD ఒక ప్రకటనలో తెలిపింది.