ఏడాది క్రితంతో పోలిస్తే నిత్యావసర ధరలు భారీగా పెరిగినట్లు పౌరసరఫరలశాఖ విశ్లేషణలో తేలింది. కందిపప్పు ధర 50%, బియ్యం ధర 13-25% పెరిగాయి. గతేడాది డిసెంబర్ లో కిలో కందిపప్పు 105. 82 ఉండగా, ఈ ఏడాది డిసెంబర్ లో 158. 33 పెరిగింది. కిలో ఉల్లి 27. 19 నుంచి 46. 97 చేరింది. మిర్చీ, ఆయిల్ ధరలు మాత్రం తగ్గాయి. వర్షాభావ పరిస్థితులు, ఆహార పంటల సాగు తగ్గడం ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.