వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆరోగ్య శ్రీపై అవగాహన, పథకాన్ని 25 లక్షలకు పెంచడం, రోగులకు ఆరోగ్య శ్రీని దగ్గరకు చేర్చడం.. ఇంకా పలు వైద్యానికి చెందిన అంశాలపై సీఎం చర్చించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ...వైద్యం కోసం ఏ పేదవాడు అప్పలు పాలవ్వద్దు. ఆరోగ్యశ్రీని ఎప్పుడూ లేని విధంగా మరో ముందడుగుకి శ్రీకారం చుట్టాం అని సీఎం జగన్‌రెడ్డి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa