రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇన్‌ఫుట్ సబ్సిడీని సీజన్ ముగిసేలోపే అందిస్తామని వెల్లడించారు. ప్రకృతి విపత్తులను మనం ఆపలేమని, విపత్తు సంబశించినప్పుడు చిత్తశుద్ధితో స్పందించడమే ముఖ్యమన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. సీఎం వైయస్ జగన్ తీసుకున్న రైతు సంక్షేమ నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు. అనేక సంస్థలు ఏపీతో కలిసి పని చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని వెల్లడించారు. రైతులకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల ముంగిటకే ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామని మంత్రి వివరించారు.