ఛత్తీస్‌గఢ్‌లో తొమ్మిది మంది మంత్రుల చేరికతో శుక్రవారం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయి తెలిపారు. రాజ్‌భవన్‌లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన గురువారం చెప్పారు. ప్రస్తుతం, మంత్రివర్గంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు -- ముఖ్యమంత్రి సాయి మరియు ఇద్దరు డిప్యూటీ సీఎంలు.గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించి బీజేపీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa