టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్)ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని మంగళగిరి తరలించారు.
వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకుగానూ ఆయనపై కేసు నమోదు చేశారు. వృత్తి రీత్యా యశస్వి అమెరికాలో ఉంటున్నారు.